బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? యితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది.
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది. బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోన్న నేపథ్యంలో శుక్రవారం కూడా ఇదే ఒత్తిడి నెలకొంది. దీంతో గోల్డ్ ధరలు ఆరంభంలోనే దిగి వచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ లో ఇంట్రాడేలో 10 గ్రాముల బంగారం రూ. 56,500కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి.
ఇవాళ ఒక ఔన్సు వద్ద బంగారం 1865.51 డాలర్ల వద్ద ఆగింది. సోమవారం వరకూ ఇలానే ఉంటుంది. వెండి ధర కూడా ఒక ఔన్సు వద్ద 22.01 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ముగిసింది. శనివారం, ఆదివారం ట్రేడ్ హాలిడే కాబట్టి బంగారం, వెండి కొనాలనుకునేవారికి ఇది మంచి వార్తే. ఫిబ్రవరి 2న 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 58,470కు ఉండగా.. ఇవాళ అది 1310 రూపాయలు తగ్గింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. అమెరికన్ డాలర్ బలపడడం వల్ల బంగారం ధరపై ప్రభావం పడుతోంది. గరిష్ట స్థాయిల నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల కూడా పసిడిపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడడం, బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైఎస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా పేర్కొన్నారు. అయితే వీటిలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా తగ్గుదల నమోదు అయ్యే ఛాన్స్ ఉందని.. అప్పుడు బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయని అన్నారు. దీని వల్ల బంగారం కొనాలనుకునేవారికి ఈ తగ్గుదల అనేది మంచి అవకాశం అని వెల్లడించారు. కాగా బంగారం ధర రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 65 వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వెండి ధర కూడా ఒక కిలో దగ్గర రూ. 80 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాబట్టి ప్రస్తుతం తగ్గిన బంగారం, వెండి ధరలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేస్తే.. ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,240 ఉండగా.. 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400 ఉంది. అలానే 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 5,716 ఉండగా, 10 గ్రాముల ధర రూ. 57,160 ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల దగ్గర 22, 24 క్యారెట్ల బంగారం ధరలు 500, 550 రూపాయలు తగ్గాయి. ఏపీలోని మిగతా నగరాల్లో బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని గమనించాలి. ఇక గ్రాము వెండి ధర రూ. 72.50 ఉండగా.. కిలో వెండి ధర రూ. 72,500 ఉంది. ఫిబ్రవరి 9న కిలో వెండి ధర రూ. 73,500 ఉండగా.. ఇవాళ రూ. 500 తగ్గింది.
Leave a Reply