Gold Rate Today | బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. పసిడి రేటు ఈ రోజు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
Gold Prices | బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. బంగారం ధరలు ఆరంభంలోనే దిగి వచ్చాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో ఇంట్రాడేలో పది గ్రాములకు రూ. 56,500 స్థాయికి పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 1878 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటు కూడా దిగి వచ్చింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 22.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
బంగారం ధర ఇటీవల జీవిత కాల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. పది గ్రాముల బంగారం ధర రూ. 58,850కు చేరింది. అంటే ప్రస్తుతం బంగారం ధర ఈ గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా రూ. 2300కు పైగా పడిపోయిందని చెప్పుకోవచ్చు.
కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. అమెరికా డాలర్ బలపడటం వల్ల పసిడి రేటుపై ప్రభావం పడుతోంది. గరిష్ట స్థాయిల నుంచి మళ్లీ వెనక్కి వచ్చేస్తోంది. బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
అయితే ప్రస్తుతం బంగారం ధరల్లో తగ్గుదల అనేది కొనుగోలుదారులకు మంచి అవకాశం అని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం అని పేర్కొంటున్నారు. బంగారం ఇంకా బుల్లిష్‌గానే కనిపిస్తోందని తెలిపారు.
ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గాయని తెలిపారు. అయితే వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా తగ్గుదల నమోదు కావొచ్చని, అప్పుడు బంగారం ధరలు మళ్లీ పరుగులు పెట్టొచ్చని వివరించారు. అందువల్ల బంగారం కొనే వారికి ఈ తగ్గుదల అనేది మంచి ఛాన్స్అని చెప్పారు.
కాగా బంగారం ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి రేటు ఏకంగా పది గ్రాములకు రూ. 65 వేలకు చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే బంగారు ప్రియులకు భారీ షాక్ తప్పదని చెప్పుకోవచ్చు. మరోవైపు సిల్వర్ రేటు కూడా దూసుకుపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీని రేటు ఏకంగా కేజీకి రూ. 80 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.
Leave a Reply