SecondBombay

  • Contact Us

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా!!

February 24, 2023 by admin Leave a Comment

పసిడి ప్రియులు గత పది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలతో మంచి జోష్ లో ఉన్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి విపరీతంగా పెరిగిన బంగారం ధరలు బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడేలా చేశాయి. ఓ దశలో బంగారం ధర 60 నుండి 62 వేల వరకు చేరుతుందన్న అంచనాలు కూడా నిపుణుల నుండి వ్యక్తమయ్యాయి. ఇక అలాంటి పరిస్థితిలో తాజాగా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ రావడం గోల్డ్ లవర్స్ కు శుభవార్త అని చెప్పాలి.

Gold Price Today Golden News for Gold Lovers the Prices of Gold Have Dropped Again Today Price

ఒక నెల కనిష్టానికి తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు ప్రస్తుతం ఒక నెల కనిష్ట స్థాయికి తగ్గడం ప్రస్తుతం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల యూఎస్ వడ్డీరేట్లు పెంపు చేసినప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, దేశీయంగా ధరలు పెరిగిన బంగారం, ఇప్పుడిప్పుడే క్రమంగా కిందికి దిగొస్తోంది. ఇప్పుడు మళ్లీ యూఎస్ ఫెడరేట్ల పెంపు జరుగుతుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుదల ఆసక్తికరంగా మారింది. మరో వైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది.

హైదరాబాద్లో నేడు బంగారం ధరల తగ్గుదల.. లేటెస్ట్ రేట్లు ఇవే
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ బంగారం ఔన్స్ కు 1823.69 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశీయంగాను బంగారం ధరలు పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 వద్ద కొనసాగుతుంది .నిన్న ఈ ధర 52,000 వద్ద ఉంది. అంటే 200 రూపాయలు 22 క్యారెట్ల బంగారం మీద ధర తగ్గింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక నిన్నటి ధర 56,730 ఉండగా నేడు 220 రూపాయల మేర 24 క్యారెట్ల పై బంగారం ధర తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో బంగారం ధరలిలా
ఇలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 950 రూపాయలుగా కొనసాగుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,610 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51 వేల 800 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది.

విజయవాడ, విశాఖ, చెన్నై లలో ధరలిలా
ఇక విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,800 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 56,510 గా ట్రేడ్ అవుతుంది. విశాఖలోని ఇవే ధరలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దేశంలోనే ధరలు ఎక్కువగా ఉండే చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,220 వద్ద కొనసాగుతుంది.

దేశంలో బంగారం స్మగ్లింగ్ కూడా .. భారీగా పట్టుబడిన బంగారం
ఓవైపు బంగారం ధరలు ఈ విధంగా కొనసాగుతూ ఉంటే, దేశంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారు కూడా విపరీతంగా పెరిగిపోయారు. విమానాల ద్వారా బంగారాన్ని ఇతర దేశాల నుండి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా 23 మంది సూడాన్ దేశస్తులు తమ షూస్ కింద ప్రత్యేకమైన అరలలో బంగారాన్ని తరలిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 8 కోట్లు విలువ చేసే 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం దొరకడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

Filed Under: News

బంగారం కొంటున్నారా ? ఈ భారీ మోసంతో జాగ్రత్త

February 20, 2023 by admin Leave a Comment

ఆడవాళ్లు అలంకార ప్రియులు. ఏ పండుగైనా, వేడుకైనా ముందు చూసుకునేదీ చీరలతో పాటు నగలే. బంగారం నగలు వేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇవి అందంతో పాటు అవసరానికి ఉపయోగపడుతుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

are-you-buying-gold-beware-of-this-huge-scam

దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ నుండి పెరుగుతూ వచ్చిన ధరలు జనవరిలో రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో బంగారానికి ఉండే మోజు, క్రేజ్ వేరు. అందుకే బంగారం కొనుగోళ్లలో దేశం రెండవ స్థానంలో ఉంది.

కేవలం మహిళలే బంగారు ఆభరణాలపై మక్కువ చూపడం లేదు, పురుషులు సైతం వీటిని ధరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏ శుభకార్యమైనా, పండగైనా బంగారు నగలు ఉండాల్సిందే. బంగారం ధరలు పెరుగుతున్నాయంటే.. ప్రతి ఒక్కరీ మొహం వెల వెలబోతూ ఉంటుంది. వీటి ధరలు తగ్గుతున్నాయంటే చాలూ షాపులు సైతం కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. అయితే ఈ ఆసక్తినే దుకాణాదారులు క్యాష్ చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

వాస్తవంగా చెప్పాలంటే స్వచ్ఛమైన బంగారం మెత్తగా, సాగే గుణం ఉంటుంది. దీంతో ఇది నగగా మారే అవకాశం లేదు. దీన్ని రాగితో కలిపి ఓ వస్తువుగా తయారు చేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో కూడా జిమ్మిక్కు ఉంది. 10 గ్రాముల వస్తువును తయారు చేయించుకోవాలంటే అందులో 1నుండి 2 గ్రాముల రాగి కలుస్తుంది.

రాగి ధరను కూడా బంగారం ధరతో సమానంగా లెక్కించి..మన దగ్గర నుండి వసూలు చేస్తారు. వాళ్లు తరుగు, మజూరీ అంటూ మరింత లెక్క చెప్పి మరింత నగదు దండుకుంటారు. అదేవిధంగా వజ్రాలు, ఇతర రాళ్లకు సంబంధించిన నగలు కూడా ఇదే విధంగా విలువ కడతారు. బంగారం, రాళ్లకు వేరు వేరు ధరలు చూపించాల్సి ఉన్నప్పటికీ.. రాళ్లకు కూడా బంగారం ధరే వేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియనవి. బంగారు షాపులు యజమానులు కానీ, చిన్న చిన్నదుకాణదారులు ఇవన్నీ చెప్పరు. ఏమాత్రం అనుమానం రాకుండా కొనుగోలు దారుల నుండి డబ్బులను తమ జేబుల్లోకి నింపుకుంటున్నారు.

buying-gold-beware-of-this-huge-scam

బంగారంలో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 12 క్యారెట్ ఉంటాయి. క్యారెట్ల బట్టి స్వచ్ఛతలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే మనకు అత్యవసరమైనప్పుడు అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా 24 క్యారెట్, 22 క్యారెట్ల నగలకే విలువ కడతారు. మిగిలినవీ కేవలం అలంకరణ, అందం కోసమే. మరీ అలాంటి బంగారం చిన్నముక్కైనా విలువైనదే. ఇటీవల దుకాణాదారులు పలు బంగారం దుకాణ దారులపై దాడులు జరిగితే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

బంగారం కొనుగోలు సమయంలో దుకాణాదారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఓ వస్తువు కొనుగోలు చేయాలంటే మిల్లీ గ్రామ్ కూడా విలువైనదే. ఎందుకంటే దానిపై ధరను కూడా మనకు వేస్తారు. ఇందులో జరుగుతున్న మోసాలనే కొలతలు తూనికల శాఖ అధికారులు బయట పెట్టారు.

బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వస్తున్న కస్టమర్లను ఏ మాత్రం అనుమానం రాకుండా దుకాణారులు మోసగిస్తున్నారు. మిల్లీ గ్రాముల్లో బంగారాన్ని కొట్టేస్తున్నారు. బంగారం కొలిచే తూనికలు కచ్చితమైనవి వినియోగించకపోవడం, మరికొన్నిముందుగా సెట్ చేసుకున్న మిషన్లలో వీటిని తూస్తుండటంతో మిల్లీ గ్రాముల్లో తేడా వస్తోంది. ధర మాత్రం ఎంత బంగారం చూపిస్తే అంతకే వసూలు చేస్తున్నారు. మరికొన్ని మిషన్లు పాడైపోయినప్పటికీ, వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ఇది అసలు ఏమాత్రం కొనుగోలు దారుడు గమనించలేడు. ఈ రకమైన మోసాలు పెద్ద షాపుల్లోనే కాదూ చిన్నపాటి దుకాణాదారులు జరుగుతున్నాయి.

అందుకే వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగ కొనే సమయంలో తూకాన్ని ఒకటి రెండు సార్లు తనిఖీ చేయాలని, తూనికలు, కొలతలు శాఖ నుండి ఆమోదించిన తూనికలు వినియోగిస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాళ్లకు, బంగారానికి వేర్వేరు ధరలను కూడా విడిగా చూపించాలి. వీటి ద్వారా కొంత వరకు మోసాల నుండి బయటపడొచ్చని చెబుతున్నారు. బంగారం మిల్లీ గ్రాముల్లో మోస పోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Filed Under: News

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర!

February 11, 2023 by admin Leave a Comment

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? యితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది.

good-news-for-gold-buyers

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. పసిడి ధరలు తగ్గాయి. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమో కాదో అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. ఈ నెల ప్రారంభంలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 53 వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 57,820 ఉంది. ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఫిబ్రవరి 6,7,9 తేదీల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ మాత్రం బంగారం తగ్గింది. బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోన్న నేపథ్యంలో శుక్రవారం కూడా ఇదే ఒత్తిడి నెలకొంది. దీంతో గోల్డ్ ధరలు ఆరంభంలోనే దిగి వచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ లో ఇంట్రాడేలో 10 గ్రాముల బంగారం రూ. 56,500కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి.

ఇవాళ ఒక ఔన్సు వద్ద బంగారం 1865.51 డాలర్ల వద్ద ఆగింది. సోమవారం వరకూ ఇలానే ఉంటుంది. వెండి ధర కూడా ఒక ఔన్సు వద్ద 22.01 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ముగిసింది. శనివారం, ఆదివారం ట్రేడ్ హాలిడే కాబట్టి బంగారం, వెండి కొనాలనుకునేవారికి ఇది మంచి వార్తే. ఫిబ్రవరి 2న 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 58,470కు ఉండగా.. ఇవాళ అది 1310 రూపాయలు తగ్గింది. కమోడిటీ ఎక్స్ఛేంజ్ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. అమెరికన్ డాలర్ బలపడడం వల్ల బంగారం ధరపై ప్రభావం పడుతోంది. గరిష్ట స్థాయిల నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల కూడా పసిడిపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడడం, బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైఎస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా పేర్కొన్నారు. అయితే వీటిలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా తగ్గుదల నమోదు అయ్యే ఛాన్స్ ఉందని.. అప్పుడు బంగారం ధరలు మళ్ళీ పెరుగుతాయని అన్నారు. దీని వల్ల బంగారం కొనాలనుకునేవారికి ఈ తగ్గుదల అనేది మంచి అవకాశం అని వెల్లడించారు. కాగా బంగారం ధర రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 65 వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వెండి ధర కూడా ఒక కిలో దగ్గర రూ. 80 వేలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాబట్టి ప్రస్తుతం తగ్గిన బంగారం, వెండి ధరలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేస్తే.. ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,240 ఉండగా.. 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400 ఉంది. అలానే 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 5,716 ఉండగా, 10 గ్రాముల ధర రూ. 57,160 ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల దగ్గర 22, 24 క్యారెట్ల బంగారం ధరలు 500, 550 రూపాయలు తగ్గాయి. ఏపీలోని మిగతా నగరాల్లో బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని గమనించాలి. ఇక గ్రాము వెండి ధర రూ. 72.50 ఉండగా.. కిలో వెండి ధర రూ. 72,500 ఉంది. ఫిబ్రవరి 9న కిలో వెండి ధర రూ. 73,500 ఉండగా.. ఇవాళ రూ. 500 తగ్గింది.

Filed Under: News

Gold Price Today: గుడ్ న్యూస్ | రూ.2,300 పతనమైన బంగారం ధర | ఆల్‌టైమ్ గరిష్టం నుంచి

February 10, 2023 by admin Leave a Comment

Gold Rate Today | బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. పసిడి రేటు ఈ రోజు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

falling-gold-price

Gold Prices | బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. బంగారం ధరలు ఆరంభంలోనే దిగి వచ్చాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో ఇంట్రాడేలో పది గ్రాములకు రూ. 56,500 స్థాయికి పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 1878 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటు కూడా దిగి వచ్చింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 22.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగి రావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

బంగారం ధర ఇటీవల జీవిత కాల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. పది గ్రాముల బంగారం ధర రూ. 58,850కు చేరింది. అంటే ప్రస్తుతం బంగారం ధర ఈ గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఏకంగా రూ. 2300కు పైగా పడిపోయిందని చెప్పుకోవచ్చు.

కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే.. అమెరికా డాలర్ బలపడటం వల్ల పసిడి రేటుపై ప్రభావం పడుతోంది. గరిష్ట స్థాయిల నుంచి మళ్లీ వెనక్కి వచ్చేస్తోంది. బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

అయితే ప్రస్తుతం బంగారం ధరల్లో తగ్గుదల అనేది కొనుగోలుదారులకు మంచి అవకాశం అని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం అని పేర్కొంటున్నారు. బంగారం ఇంకా బుల్లిష్‌గానే కనిపిస్తోందని తెలిపారు.

ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గాయని తెలిపారు. అయితే వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా తగ్గుదల నమోదు కావొచ్చని, అప్పుడు బంగారం ధరలు మళ్లీ పరుగులు పెట్టొచ్చని వివరించారు. అందువల్ల బంగారం కొనే వారికి ఈ తగ్గుదల అనేది మంచి ఛాన్స్అని చెప్పారు.

కాగా బంగారం ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి రేటు ఏకంగా పది గ్రాములకు రూ. 65 వేలకు చేరొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే బంగారు ప్రియులకు భారీ షాక్ తప్పదని చెప్పుకోవచ్చు. మరోవైపు సిల్వర్ రేటు కూడా దూసుకుపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీని రేటు ఏకంగా కేజీకి రూ. 80 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.

Filed Under: News

పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్క నెలలో ఎంత పెరిగిందంటే..?

February 8, 2023 by admin Leave a Comment

Bad news for pasidi lovers.. The price of gold has increased again.. How much has it increased in one month..? | పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్క నెలలో ఎంత పెరిగిందంటే..?

gold Price increased again

ఒక వెబ్ సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.280 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.57,440 వద్ద ట్రేడవుతోంది. అలాగే 1 కిలో వెండి ధర రూ.71,200 వద్ద మారలేదు.

నేడు మిశ్రమ ప్రపంచ సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం ధర అధికంగా ట్రేడవుతోంది, వెండి ధర 0.22% తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 366 లేదా 0.65% పెరిగి రూ.56,951 వద్ద ట్రేడవుతున్నాయి. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలోకు రూ.147 తగ్గి రూ.67,429గా ట్రేడవుతున్నాయి.

ఒక వెబ్ సైట్ ప్రకారం, మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు రూ.280 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.57,440 వద్ద ట్రేడవుతోంది. అలాగే 1 కిలో వెండి ధర రూ.71,200 వద్ద మారలేదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.52,650 వద్ద ట్రేడవుతోంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లో 52,650 వద్ద ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.52,800, చెన్నైలో రూ.53,650, బెంగళూరులో రూ.52,700గా ఉంది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలో సమానంగా రూ.57,440గా ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.57,590, చెన్నైలో రూ.58,530, బెంగళూరులో రూ.57,490గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.57,440. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.52,650, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.57,440. కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000. జనవరి నెల మొత్తంగా చూస్తే బంగారం ధర ఏకంగా రూ.2200 వరకు ఎగిసింది.

0316 GMT నాటికి స్పాట్ బంగారం 0.4 శాతం పెరిగి ఔన్సుకు $1,873.96 వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $1,886.60 డాలర్లకి చేరుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.758 వద్ద స్థిరంగా ఉంది.

స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $22.33 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం తగ్గి $970.94 డాలర్లకు, పల్లాడియం 0.1 శాతం తగ్గి $1,596.74 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.71,200గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.74,000గా ఉంది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

Recent Posts

  • పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు ధరలిలా!!
  • బంగారం కొంటున్నారా ? ఈ భారీ మోసంతో జాగ్రత్త
  • Kamna Designs – Chennai Helpline Number | Contact Details | Branches List
  • CMR JEWELLERY HELPLINE NUMBER | BRANCHES LIST | Andhra Pradesh | Telangana
  • VAIBHAV JEWELLERS BRANCHES LIST | HELPLINE NUMBER | VIDEO SHOPPING | ANDHRA PRADESH

Pages

  • Contact Us
  • Gold | Silver | Copper | Jewellery Shops

Categories

  • ANDAMAN & NICOBAR
  • ANDHRA PRADESH
  • ARUNACHAL PRADESH
  • ASSAM
  • BIHAR
  • CHANDIGARH
  • CHHATTISGARH
  • CKC
  • CMR
  • DADRA & NAGAR HAVELI
  • DAMAN & DIU
  • DELHI
  • GOA
  • Gold
  • GUJARAT
  • HARYANA
  • HIMACHAL PRADESH
  • JAMMU & KASHMIR
  • JEWELLERY
  • JHARKHAND
  • KARNATAKA
  • KERALA
  • LAKSHADWEEP
  • LALITHAA
  • MADHYA PRADESH
  • MAHARASHTRA
  • MALABAR
  • MANIPUR
  • MEGHALAYA
  • MMTC-PAMP
  • NAGALAND
  • National
  • News
  • ODISHA
  • PC Jeweller
  • PONDICHERY
  • Proddatur
  • PUNJAB
  • RAJASTHAN
  • Rates
  • Senco
  • SIKKIM
  • State
  • Store
  • Studio
  • TAMIL NADU
  • Tanishq
  • TBZ
  • TELANGANA
  • TRIPURA
  • UTTAR PRADESH
  • UTTARAKHAND
  • VAIBHAV
  • WEST BENGAL

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in